మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 02::
మండలంలోని కాటాయిగూడెం గ్రామానికి చెందిన కొరస లక్ష్మి ఐఐటి పాట్నలో సీటు సాధించింది. గిరిజన విద్యార్థి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్న దాతలు తమ వంతుగా ఆర్థిక సాయం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తమ గ్రామానికి చెందిన విద్యార్థి ఉన్నత చదువుల కోసం గ్రామస్తులు చేయి చేయి కలిపి లక్ష్మి ఉన్నత చదువు కొరకు 22,000 నగదును అందించగా, నరసాపురం ప్రాథమిక వైద్య కేంద్రం స్టాఫ్ నర్స్ మాధవి తన వంతుగా 5000 రూపాయలు నగదును మొత్తంగా 27 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం నాడు విద్యార్థిని తల్లిదండ్రుల సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా లక్ష్మి అభినందించి భవిష్యత్తులో మంచిగా విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారికి నగదును అందించిన దాతలు కాటాయిగూడెం గ్రామస్తులు కోడి లక్ష్మయ్య, లచ్చమ్మ, వెంకటేశ్వరరావు, రామదేవి, వీరస్వామి, సునీత, నాగరాజు, నీలిమ,రమేష్, నాగమణి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.