మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం మసివాగు గ్రామపంచాయతీ ధర్మారంతండా రోడ్డు మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే హరిప్రియ ఆగి రోడ్డుపక్కన పొలంలో నాటువేస్తున్న రైతు కూలీ మహిళలతో ముచ్చటించారు. వరి పొలంలో మహిళా రైతు కూలీలను ఆప్యాయంగా పలకరించి ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్, రైతు కూలీలతో కలిసి వరినాటు వేశారు. ఒక సాదారణ మహిళగా వరి పొలంలో నాటు వేసినందుకు గానూ చుట్టుపక్కల జనాలు, ఆనందం వ్యక్తం చేశారు, సెల్యూట్ అంటున్నారు.