UPDATES  

 మద్యం పాలసీ ప్రకారం రిజర్వేషన్ లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశాం – జిల్లా కలెక్టర్ డా ప్రియాంక తెలిపారు.

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం రిజర్వేషన్ లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక తెలిపారు. గురువారం ఐడిఓసిలో కలెక్టర్ ఛాంబర్ లో ఎక్సైజ్ అధికారులు, ఎస్సి, ఎస్టీ, బిసి సంక్షేమ అధికారుల త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 88 మద్యం దుకాణాలకు గాను ఇది వరకే ఏజెన్సీ ప్రాతంలోని గిరిజనులకు కేటాయించిన 44 మద్యం దుకాణాలు పోను మిగిలిన 44 మద్యం దుకాణాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 13 మద్యం దుకాణాలకు రిజర్వేషన్లను లక్కీ డ్రా ద్వారా ఖరారు చేసినట్లు తెలిపారు. ఇందులో గౌడ కులానికి 06, ఎస్సీలకు 07 మద్యం దుకాణాలు డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. లక్కీ డ్రా ద్వారా గౌడ కులస్తులకు గెజిట్ సీరియల్ నెంబర్ 01,03,11,21,39,79 దుకాణాలు, ఎస్సిలకు 10,12,13,20,36,43,82 నెంబర్ దుకాణాలు ఎంపిక చేశామన్నారు. శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తామని ఈ నెల 18 సాయంత్రం 6 గంటల వరకు అన్ని పనిదినాలలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అబ్కారీ శాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, కొత్తగూడెం జిల్లా అబ్కారీ అధికారి జానయ్య, జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారిణి అనసూయ, గిరిజన సంక్షేమశాఖ డిడి మనెమ్మ, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి ఇందిర, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
కరంచంద్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు తదితరులు   పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !