UPDATES  

 సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 

మన్యం న్యూస్, పినపాక:

రైతును రాజుగా మార్చడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మండల పరిధిలో ఈ .బయ్యారం పంచాయతీలోని రైతు వేదిక నందు మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని, రైతుబంధు రైతు బీమా తో పాటు రైతు రుణమాఫీ కూడా చేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్తిబాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !