UPDATES  

 కోరం కనకయ్యను రాజకీయంగా బొందపెట్టడం ఖాయం ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండల ఎంపీటీసీలు కొప్పురాయి శాంతకుమారి, కిష్టారం ఎంపీటీసీ పూణెం స్వప్న, తడికలపూడి ఎంపిటిసి భానోత్ మౌనికలను కాంగ్రెస్ పార్టీనాయకులు కోరం కనకయ్య మంగళవారంనాడు ఇల్లందు పట్టణంలో జరిగిన చేరికల కార్యక్రమం పేరుతో బారాసా పార్టీ ప్రజాప్రతినిధులను మాట్లాడదామని పిలిచి మభ్యపెట్టి వారితో బలవంతంగా పార్టీ మారిపించారని, మరోసారి బారాస పార్టీ ప్రజాప్రతినిధుల జోలికి గాని కార్యకర్తల జోలికి గాని వస్తే చూస్తూ ఊరుకోమని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ద్వజమెత్తారు. ఈ నేపథ్యంలో టేకులపల్లి మండల హెడ్ క్వార్టర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ..బారాస పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇల్లందు నియోజకవర్గం అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. స్వలాభం తప్ప అభివృద్ది పట్టని గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని ఇల్లందును కేసీఆర్ ఆశీస్సులతో నా హయాంలో అనేకరంగాల్లో అభివృద్ది చేసి రాష్ట్రంలోనే ఇల్లందుకు ప్రత్యేకస్థానాన్ని తెచ్చానని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఉద్ఘాటించారు. టేకులపల్లి మండలం నేడు అభివృద్ధిలో ఉరకలు పెడుతూ ఉంటే అదిచూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం కనకయ్య మా పార్టీ ఎంపీటీసీలు అయిన చింత శాంతకుమారి, స్వప్న, భానోత్ మౌనికలను తన మాయమాటలతో నమ్మించి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారని, కోరం కనకయ్య వంచన మాటలు నమ్మని తమ బారాస పార్టీ ఎంపీటీసీలు తిరిగి గులాబీ జెండా నీడలోనే తమ ప్రయాణం అని తేల్చిచెప్పారని ఇది నైతికంగా కోరం కనకయ్యకు ఒక చెంపపెట్టు అని ఎద్దేవా చేశారు. కేవలం తన ఉనికిని చాటుకోవడం కోసం తనబలం, బలగం ఇది అని చూపించడం కోసం చేరికల పేరుతో హైడ్రామా నడిపి గతంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులకు తిరిగి మళ్లీ కండువాలు కప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ పొలిటికల్ డ్రామాకు తెరలేపాడని దుయ్యబట్టారు. టిక్కెట్టు తనకే వస్తుందో లేదోనన్న భయంతో కోరం కనకయ్య ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నాడని, కుట్రలు కుతంత్రాలు పన్నడంలో కనకయ్యని, పొంగిలేటిని మించిన వారేవరులేరని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయటం కొత్తేమీ కాదని, పదవీ వ్యామోహం గల కనకయ్య ఏనాడూ తన స్వలాభం తప్ప ప్రజాసంక్షేమం కోసం ఇల్లందుకు చేసింది శూన్యమని అన్నారు. దొంగలముఠా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాలకు టిక్కెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఎందరో రాజకీయ నాయకులను తనవైపు తిప్పుకున్నారని, తీరా కొన్నిచానల్స్ లో నేను అలా అనలేదని ఇప్పటికే మాటమార్చిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి రేపటి రోజున వీరందరినీ ఖమ్మం మున్నేరు వాగులో ముంచడం ఖాయమని అదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. వీరిద్దరిని నమ్ముకున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపపడక తప్పదని ఆ రోజులు అతికొద్ది దూరంలోనే ఉన్నాయని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డీవీ, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్, ఉపాధ్యక్షుడు చీమల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భానోత్ కిషన్ నాయక్, భూక్య పాపనాయక్, బోడబాలు, సీనియర్ నాయకులు బానోత్ రామ, అనంతల శీను, దళపతి శీను తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !