మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని గడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు పోలెబోయిన ఉమారాణి (41) కొద్ది రోజులుగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతూ గురువారం కొత్తగూడెం ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినది. మృతురాలు మణుగూరు మండలంలోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. అకస్మాత్తుగా మృతి చెందిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని పలువురు ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.