మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 3: రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన చూపిన తెగువ రైతుల కుటుంబాల్లో స్థిర స్థాయిగా నిలిచిపోతాడని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు(బాబు )అన్నారు. గురువారం రైతులకు రూ.1 లక్ష రూపాయల వరకు రుణమాపీని ప్రకటిస్తూ, వెంటనే అమలు చేయడాన్ని హర్షిస్తూ బిఆర్ఎస్ మండల కమిటి ఆద్వర్యంలో అయ్యన్నపాలెం రైతువేదికలో సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దారా బాబు మాట్లాడుతూ…. రైతుల కోసం నిరంతరం తపించే నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో మరోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు లంకా విజయలక్ష్మి, గాదె లింగయ్య, నల్లమోతు వెంకటనారాయణ, భూపతి రమేష్, గుగులోత్ రమేష్, చీదెళ్ల పవన్ కుమార్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, బడికల శ్రావణ కుమార్, అంచ క్రిష్ణ, ఉన్నం నాగరాజు, చాపలమడుగు రామరాజు, అనిల్, తదితరులు పాల్గొన్నారు.