- అడవుల జోలికొస్తే కఠిన చర్యలు…
- భావితరాల కోసం అడవులను సంరక్షిద్దాం…
- అడవులు జాతి సంపద – వాటి సంరక్షణ అందరిది…
- చీప్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ బీమానాయక్….
మన్యం న్యూస్ చండ్రుగొండ,ఆగస్టు 3 : అడవుల జోలికొస్తే సహించేదిలేదని, కఠినంగా చర్యలుంటాయని చీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సిసిఎఫ్) భీమానాయక్ హెచ్చరించారు. గురువారం రామవరం రేంజ్, తిప్పనపల్లి బీట్ పరిధిలో గల ప్లాంటేషన్ ను ఆయన పరిశీలించారు. అడవిలో కాలినడకన ప్లాంటేషన్ మొక్కలను పరిశీలించారు. ప్లాంటేషన్లో పక్షుల గూళ్లను, వాటిలో పక్షుల పిల్లలను, వాటి అరుపులను తన కెమెరాలో బంధించాడు. పోటోలను తీసుకొని ఉన్నతాధికారులు పంపనున్నట్లు తెలిపాడు. అడువుల పునఃరుద్ధరణ సగటున దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. అడవులను సంక్షరించటం కోసం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు హరితహరం కార్యక్రమాన్ని పెద్దెత్తున్న చేపడుతుందని, అది విజయవంతం అయిందన్నారు. అడవులు జాతి సంపదని, కొందరి కోసం అడవులను ధ్వంసం చేయటం సరికాదన్నారు. ఇప్పటికే ఆక్సిజన్ కొనుక్కునే రోజులు వచ్చాయని, అడవులను సంరక్షించకపోతే భవిష్యత్ తరాల మనుగడ కష్టంగా ఉంటుందన్నారు. ఎవరికివారు అడవులను కాపాడటం కర్తవ్యంగా భావించాలన్నారు. ఇప్పటికే 50వేల హెక్టార్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్లాంటేషన్లో మొక్కలు పెంచటం జరుగుతుందన్నారు. నశించిన అడవుల స్థానంలో కొత్తగా ప్లాంటేషన్లు ఏర్పాటు చేసి, మొక్కలను పెంచటం జరుగుతుందన్నారు. ప్లాంటేషన్ల ఏర్పాటు వల్ల పచ్చని గడ్డి మొక్కలు పెరిగిన అడవి జంతువుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, వాటికి తిరిగే స్వేచ్ఛ దొరుకుతుందన్నారు. అంతరించిపోతున్న పక్షుల జాతులు మళ్లీ పునఃరుద్దరణ జరుగుతుందన్నారు. పోడు పేరుతో అడవులను నరికిన, వారికి సహకరించిన పిడి యాక్టు కేసులు నమోదు చేస్తామని, అవసరం అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చూస్తామన్నారు. చండ్రుగొండకు పూర్తిస్థాయిలో రేంజర్ త్వరలోనే వస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఎఫ్ క్రిష్ణగౌడ్, ఎఫ్ఓ అప్పయ్య, రేంజర్ ఉమ, సెక్షన్ అధికారి మస్తాన్ రాజ్, ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
