మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సోయం రాజారావు నేతృత్వంలో రైతుల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సోయం రాజారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని రైతులకు రుణమాఫీ పునఃప్రారంభించిన రైతు బాంధవుడు,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ రుణమాఫీ నిర్ణయం పట్ల ప్రతి రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.ఇంతటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ కు రైతుల తరుపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.19,000 కోట్ల రూపాయల రుణమాఫీతో 31 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. ఇలా రుణమాఫీ చేయటం ద్వారా మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరోసారి నిరూపించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొసరాజు కుమార్ రాజా,చర్ల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు, రైతు బంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ఉపాధ్యక్షులు పోలిన లంకరాజు, అయినవోలు పవన్, దొడ్డి సూరిబాబు, తోటమల్ల వరప్రసాద్, కాపుల నాగరాజు, కాకి అనిల్, ఆలం ఈశ్వర్, తుర్రం రవి తదితరులు పాల్గొన్నారు.
