మన్యం న్యూస్ ఏటూరు ఏటూరు నాగారం
ఇటీవల భారీ వర్షాలకు వచ్చిన వరదల కారణంగా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం పూర్తిగా ధ్వంసమై గ్రామంలోని ఇండ్లన్నీ నేలమట్టం కావడం జరిగింది.సుమారు 8మంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహబూబాబాద్ కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాయి, మల్యాల గ్రామాల వరద బాధితులకు సహాయం చేయాలనే ఆలోచనతో సభ్యులందరూ కలిసి సుమారు లక్ష రూపాయల విరాళాలు వేసుకొని అట్టి గ్రామ ప్రజలకు గురువారం 200 దుప్పట్లు,100 వంట పాత్రల సెట్లు,200 చీరలు,200 లుంగీలు,200 టవల్స్ తదితర సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ,బాధ్యులు మైస నాగయ్య,మైస శ్రీనివాస్, నామిరెడ్డి వెంకట్రెడ్డి,పెద్ది వెంకన్న,పట్టాభి లక్ష్మయ్య, సోమ విష్ణువర్ధన్,మాచర్ల సుధాకర్,తోడేటి వెంకన్న,పాశం మల్లారెడ్డి,శ్యామల శ్రీనివాస్ రెడ్డి,బొజ్జ రాజేశ్వరరావు,మణి రెడ్డి,పడాల పరమేశ్వర్,కోడెం శ్రీనివాస్,దనసరి పగడయ్య, కుంజ రాంబాబు,తోలం వెంకటేశ్వర్లు,మేకల కృష్ణయ్య ,
కొంపెల్లి బిక్షం,గోనే శ్యామ్ రావు,నల్ల మాస విక్రమ్,పిల్లి రాధాకృష్ణ,వాసం లక్ష్మయ్య,
జంగిల్ రాము,బాల బిందెల రవికుమార్,మోకాళ్ళ వెంకటేశ్వరరావు,విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు రూపి రెడ్డి వెంకట్ రెడ్డి,అక్కెర మోహన్ రావు,టీపీటీఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్,కొడెం శ్రీనివాస్,
ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.