UPDATES  

 దొడ్ల గ్రామ వరద బాధిత కుటుంబాలకు ట్రస్ట్ ల సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,మండల అధ్యక్షులు చిటమట రఘు, సూచనలమేరకు జిల్లా అసెంబ్లీ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల గ్రామాలలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి ఇల్లు మునిగి పోవడం జరిగింది.
గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి, కుటుంబాలకు ట్రస్ట్ ల సహాయ సహకారంతో మొత్తం 50 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం,2 దుప్పట్లు,పప్పు,3 నూనె ప్యాకెట్స్,2 చాపలు,2 లుంగీలు,2 చీరలు,2 టవల్స్ నెల రోజులకు సరిపడ 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఈ సందర్భంగా జిల్లా అసెంబ్లీ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న మాట్లాడుతూ.ముంపు ప్రాంతాల ప్రజలు దైర్యంగా ఉండండి మీకు అండగా మేము ఉంటామని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి బాధిత కుటుంబాలకు సహాయం చెయ్యడానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతు న్నామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయంతో పాటు వరుదల్లో కొట్టుకు పోయి మరణించిన మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుడ్ల దేవేందర్, కొండాయి సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్,
టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్,వర్కింగ్ టౌన్ సరికొప్పుల శ్రీనివాస్,మండల సహాయ కార్యదర్శి ఉమ్మనేని రమేష్,టౌన్ ఉపాధ్యక్షులు మామిడి రాంబాబు,కొండాయి ఉప సర్పంచ్ మహేష్,మహిళా సీనియర్ నాయకురాలు &వార్డ్ సభ్యురాలు కమలక్క,నాగవత్ కిరణ్,గ్రామ పెద్దలు,
యువకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !