మన్యం న్యూస్, పినపాక
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిల్చారని, రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు అందిస్తూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా మార్చారని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు . బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ రుణమాఫీ అమలు ప్రకటన చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం దండగలా మారగా స్వరాష్ట్ర తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు రైతుల కోసం ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు గొగ్గల నాగేశ్వరరావు, కొర్సా క్రిష్ణం రాజు, పోతినేని శివశంకర్, సోంబోయన సుధాకర్, సోసైటి డైరెక్టర్ కోండేరు రాము,ఎంపిటీసి చింతపంటి సత్యం , సత్తి రెడ్టి, తదితరులు పాల్గొన్నారు