- పర్యటన సరే..
- పరిహారం ఎపుడు?
- పంట నష్టం పై కేంద్ర బృందం పర్యటన
- ప్రశ్నించిన బాధితులు
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఏడుగురు సభ్యులతో పర్యటించిన కేంద్ర బృందం ఈ క్రమంలో ముందుగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న పులితేరు వాగు పరిసర ప్రాంతాల్లో గోదావరి దాటికి మృత్యువాత పడ్డ పంట మొక్కలను పట్టుకొని పరిసిలించారు,సమీప రైతులతో మాట్లాడుతు ఏఏ పంటలు నష్టానికి గురయ్యాయి ఎంత నష్టం కలిగింది అని అడిగి తెలుసుకున్నారు,పంట నష్టం పై అధికారులు నివేధిక తెలపాలి అని ఆదేశించారు. ఇక సమీప రైతులు వారి మొరను కేంద్ర బృందానికి ఆలపించుకున్నారు. కష్టపడి భూములను కౌలుకు తీసుకొని పుస్తెల తాడు తాకట్టు పెట్టి,బయట వడ్డీలకు ధనం పట్టుకువచ్చి మేము నాన గోడ్డు చాకిరీ చేసి పంట పందిస్తుంటే తీరా గోదావరి గంగానమ్మ పుణ్యాన పంట మొత్తం సర్వనాశనం ఐతే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గత నాలుగేళ్లుగా రూపాయి నష్టపరిహారం కుడా ఇవ్వలేదు అని,ఒక వేళ తులమో,పకమో పంట నష్ట పరిహారం వచ్చినా పట్టా పుస్తకం దారునికి వెళ్తయి అని,అసలు పంట పండించి రైతులు ఆగం అవుతున్నారు అని తెలిపారు.ముఖ్యంగా గెట్టు నెంబర్లు కలిగిన రైతులు ఎక్కువగా ఉన్నారని,నిజమైన పేద రైతులు గెట్టు నెంబర్ ఉన్న రైతులని వారికి రైతుబంధు,రైతు బీమా వర్తించడం లేదని కనీసం నష్టపోయిన పంటకు డబ్బులు కూడా రావని ఆవేదన వెక్తం చేశారు.అనంతరం ఇక్కడి నుండి మండల కేంద్రంలోని కొల్లు చెరువు సమీపంలో వరద ముంపు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు,గోదావరి వరద తీవ్రత ఎలా వచ్చింది ఈ గ్రామానికి అని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాను అడిగి తెలుసుకున్న కేంద్ర బృందం,దీనిపై కలెక్టర్ వారికి వివరణ చేశారు,అనంతరం అక్కడి నుండి గోదావరి ధాటికి దెబ్బ తిన్న రహదారిని కేంద్ర బృందం క్షుణ్ణంగా పరిశీలించారు,ఇగ ప్రతి ఏడాది మేము ఇలానే ఇబ్బందులు పడాల…?క్షణక్షణం భయపడుతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉండాల….?అని పలువు రైతులు అవేదన వ్యక్తం చేస్తు మాకు శాశ్వత పరిష్కారం ఇప్పించండి అంటూ వేడుకునసాగారు,సారు గత రెండేళ్లుగా మీ పర్యటన సరే కానీ మాకు మాకు పంట పరిహారం ఏప్పుడు అని గత ఏడాది పరిహారం అందుతుంది అని ఆశ పడ్డ మా ఆశలు ఆవిరి అయ్యాయి అంటు,ఈ ఏడాది అయిన మాకు పంట పరిహారం ఇవ్వాలని కోరారు.మండల కేంద్రంతో పాటు సోంపల్లి గ్రామంలో సుమారు 500 ఎకరాలకు పైగా పత్తి,వరి,మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని వరి,నారుమడులు మునకకి గురయ్యాయి అని అంచనా వేశారు,ఇంకా మండలంలో పంట నష్టం తెలియాల్సి ఉంది అని తెలిపారు.కేంద్ర బృందం వెంట జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా,జిల్లా ఎస్పి డాక్టర్ వినీత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అభిమన్యుడు,మండల ఏవో శంకర్,తహశీల్దార్ భగవాన్ రెడ్డి,పాల్వంచ సర్కిల్ సిఐ వినయ్ కుమార్,స్థానిక సర్పంచ్ సిరిపురం స్వప్న మరియు నాగినేని ప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భూక్య శ్రావణి రైతులు భజన నాగం,మేకల నరసింహారావు,చెన్నం రవి,గ్రామ పెద్దలు జక్కం సుబ్రమణ్యం పలువురు జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు,రైతులు,నాయకులు,గ్రామ ప్రజలు ఉన్నారు.