UPDATES  

 ప్రజా నాయకుడు సున్నం రాజయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి.. కారం పుల్లయ్య

 

మన్యం న్యూస్ దుమ్మగూడెం ఆగస్టు 3::
ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం భద్రాచలం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య పిలుపునిచ్చారు. మండలంలోని సీతారామయ్య భవనంలో అమరజీవి సున్నం రాజయ్య మూడో వర్ధంతి సభ సందర్భంగా పలువురు నాయకులు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కారం పుల్లయ్య మాట్లాడుతూ భద్రాచలం నియోజవర్గంలో సున్నం రాజయ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరో లేనివని నేటి తరానికి ఆయన జీవితం ఆదర్శవంతమైనదని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించి అభివృద్ధి లక్ష్యంగా కృషి చేశారని దాని ఫలితంగానే భద్రాచలం నియోజవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు పగలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అనేక ఉద్యమాలు చేసిన నాయకుడు అసెంబ్లీలో కోయ తెగకు చెందిన మాతృభాషతో మాట్లాడిన వ్యక్తి సున్నం రాజయ్య అని అన్నారు. ఆయన స్ఫూర్తితో దుమ్ముగూడెం మండలంలో సిపిఎం పార్టీని తీసుకురావాలని నాయకులకు కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ, చంద్రయ్య, చిలకమ్మ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూర్యచంద్రరావు, శ్రీనుబాబు, కృష్ణ, గుడ్ల రామ్మోహన్ రెడ్డి, కొమరం చంటి, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !