మన్యం న్యూస్ గుండాల: మానాల భద్రయ్య కిరాణం షాప్ ఆధ్వర్యంలో వారి మనవళ్లు మానాల సతీష్ కుమార్, మానాల శ్రవణ్ కుమార్, వర్షాల దాటికి మునిగిపోయిన సాయనపల్లి గ్రామానికి చెందిన 35 మంది వరద బాధితులకు నిత్యవసర వస్తువులను గురువారం పంపిణీ చేశారు. ఆపద సమయంలో ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల నరసింహులు, ఇల్లందుల అప్పారావు, సాయన పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు
