మన్యం న్యూస్ గుండాల: భారీ వర్షాలకు ముత్తాపురం గ్రామంలోని 49 ఇండ్లు పూర్తిగా మునిగిపోవడంతో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయుడు శత్రువులాలు ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. బియ్యంతో పాటు గిన్నెలు, నిత్యవసర వస్తువులను అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సీతారామయ్య, చంద్రకాని, నవీన్, షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు
ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ: ముత్తాపురం గ్రామంలో వరద బాధితులకు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులను ఎంపీపీ ముక్తి సత్యం చేతుల మీదుగా పంపిణీ చేశారు. సంక్షేమ పరిషత్ నాయకులు సనప విష్ణు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆదివాసులకు తోడుగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాధితులు పాల్గొన్నారు
