మన్యం న్యూస్,ఇల్లందు:గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకమిటీ ప్రధానకార్యదర్శి కొక్కు సారంగపాణి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం ఇల్లెందు ఎంపీడివో కార్యాలయం ముందు నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టి నెలరోజులవుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమయిన కోరికలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల మండల జేఏసీ చైర్మన్ తొగర సామెల్ అధ్యక్షతన జరిగినఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు, ఏరియా కమిటీ అధ్యక్షులు మోహన్ రావు, జిల్లా జేఏసీ కో-కన్వీనర్ జటంగి వెంకన్న, జేఏసీ నాయకులు రామిశెట్టి నరసింహారావు, భూక్యతిరుపతి, జి.లక్ష్మణ్, బి.కిషోర్, విజయ్ కుమార్, కారంగుల కిరణ్, నాగరాజు, రంజిత్, కుంజ శ్రీను, ఝాన్సీ, కమల, సుమలత, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.