ఏడు నెలల్లో విచారణ పూర్తి …
మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్టు 3 : విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు పై వలసగొత్తి కోయలు దాడి చేసి హత్య చేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది . పోలీసులు వేగంగావిచారణ పూర్తిచేసి నిందితులపై కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు .ఈ కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయస్థానం విచారణ ఏడు నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. కోర్టులో 20 మంది విచారణ సాక్షులను విచారించిన అనంతరం గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయస్థానం ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ పిపి పోసాని రాధాకృష్ణమూర్తి,కోర్టు లైసన్ ఆఫీసర్ బాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎం రవి లు సహకరించారు.