మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 03
రైతుల సంక్షేమ బాంధవుడు సీఎం కేసీఆర్ అని మణుగూరు జడ్పిటిసి పోశం.నరసింహారావు తెలిపారు.మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం గ్రామ పంచాయతీ పరిధి లోని రైతు వేదిక వద్ద రైతులకు రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మణుగూరు జడ్పిటిసి పోశం.నరసింహారావు మాట్లాడుతూ,భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి రైతులకు సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుంది అన్నారు.రైతు బాంధవుడు గా పేరు గాంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచారు అన్నారు.రైతులకు లక్ష రుణమాఫీ ప్రకటించిన నేపథ్యం లో రైతులు పెద్ద ఎత్తున హాజరై ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమం లో మణుగూరు సొసైటీ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు కుర్రి.నాగేశ్వరరావు, దొండేటి రామ్మోహన రావు,మణుగూరు ఎంపిటిసి సభ్యులు గుడిపూడి కోటేశ్వరరావు,కనితి బాబురావు, ఏఎంసీ డైరెక్టర్ సకిని బాబురావు,ఆత్మ డైరెక్టర్ మేడా నాగేశ్వరరావు,సర్పంచులు ఏనిక ప్రసాద్,కారం. ముత్తయ్య,బొగ్గం రజిత, పాల్వంచ ఈశ్వరమ్మ,కొమరం జంపేశ్వరి,సొసైటీ డైరెక్టర్లు పిన్నమనేని మాధవి,ఉతనేని రవి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మడి వీరన్న బాబు,ఉపతల రామారావు,బత్తుల నాగేశ్వరరావు, పప్పుల ప్రసాద్, పినపాక యువజన నాయకులు మిట్టపల్లి సాగర్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రైతు నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.