మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం సుదిమళ్ళ గ్రామ పంచాయితి కి చెందిన కల్తి సూరయ్య వారం క్రితం తన పొలంలో దున్నుతుండగా విద్యుత్ షాక్ తో మరణించారు. గురువారం వారి దశ దిన కార్యం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు
హజరై సూరయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సుదిమళ్ళ గ్రామ ఉప సర్పంచ్ ఊకే క్రిష్ణ, మెట్టల వీరస్వామి, కోరం వీరస్వామి, కుంజా వెంకటేశ్వర్లు, ధనకొండ రవి, కాయం శ్రీకాంత్, బగ్గ వీరభధ్రం, కల్తి వీరయ్య, కాయం రమేష్ తదితరులు ఉన్నారు