మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 03, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చారుగుళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం మండలానికి చెందిన వందనపు సత్యనారాయణ ను రాష్ట్ర రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా, మహంకాళి గోపాలకృష్ణ ను రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ వారికి నియామక పత్రాలు అందజేశారు. తమపై నమ్మకంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు ఆగిర్ వెంకటేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు యెలుగూరి నగేష్, జి వెంకటేశ్వరరావు, కటకం బాలకృష్ణ, వసుమర్తి శ్రీనివాస్, చవ్వా జై శంకర్ తదితరులు పాల్గొన్నారు.