మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని కొనియాడారు. దేశంలోనే రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెందుతుందన్నారు. రైతు రుణమాఫీ చేయడం పట్ల, భద్రాద్రి జిల్లా రైతులు రైతు కుటుంబాల తరఫున, కోలేటి భవాని శంకర్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.