మన్యం న్యూస్ గుండాల: రేగా చలవతో గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వర్షాల దాటికి ధ్వంసమైన రహదారులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చొరవతో వేగంగా పనులను అధికారులు పూర్తి చేస్తున్నారు. గుండాల, వీరాపురం మార్గ మధ్యలో గల మల్లన్న వాగు పూర్తిగా ధ్వంసం కావడంతో గుండాల నుండి దామర్ తో వరకు 65 లక్షల రూపాయలతో మరమ్మతులను పూర్తిచేసి ప్రయాణానికి అనవుగా రహదారులను సిద్ధం చేశారు. వర్షాల దాటికి ధ్వంసమైన రహదారులను యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు ఉమ్మడి గుండాల మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు
