మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీ, సాయి కాలనీ, దేవనగరం పలు గ్రామాలలో డాక్టర్ శ్రీధర్ వైద్య బృందం దోమల నివారణకు ఇంటింటా సర్వే చేయడం జరిగింది. వైద్య బృందం ఇంటింటికి తిరిగి దోమల ఆవాసాలకు నివాసాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ నిత్య అవసరాలకు ఉపయోగించే నీరు ఏమైనా ఆవాస ప్రాంతాల్లో రెండు మూడు రోజులు కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దని ఇలా ఉంచడం వలన దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని అన్నారు. దోమలు పుట్టవద్దు కుట్టవద్దు అంటూ గ్రామస్తులకు అవగాహన పరిచారు.నిల్వ నీటి వాటిలో ఆయిల్ బాల్ వేయాలి అని తెలియ జేశారు.మూడు రోజుల పైన నిల్వ ఉన్న నీటిని పారబోయాలి అని ఇంటి తలుపులు, కిటికీ లకు మెస్సు లు ఏర్పాటు చేసుకోవాలి అని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలకృష్ణ , డిటిఎంహెచ్వో ముత్యాల రావు, జేపీఎస్ రవికుమార్ , ప్రసాద్ , రమ్య, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
