మన్యం న్యూస్ దుమ్ముగూడెం/చర్ల:
దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామం లో గడ్డం జోగయ్య ఇల్లు గురువారం అగ్ని ప్రమాదం లో దగ్ధం అయింది. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం ప్రముఖ వైద్యులు కాంగ్రెస్స్ నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయంగా మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. గడ్డం జోగయ్య కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందించాల్సిన సహాయం అలాగే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీస్కొనివెళ్లి వారి కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ, మాజీ సర్పంచ్ కంగాల వెంకటేష్, కణితి సమ్మయ్య దొర, గడ్డం కృష్ణ, కంగాల నాగరాజు, పాయం వెంకటేశ్వర్లు, సాయి, రాజ్ కుమార్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు..