రాహుల్ గాంధీ జైలుశిక్షపై సుప్రీంకోర్ట్ స్టే ఇవ్వడం పట్ల హర్షంవ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు
గాంధీభవన్లో జరిగిన వేడుకలలో పాల్గోన్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు
మన్యం న్యూస్,ఇల్లందు:కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీకి ఇటివలే గుజరాత్ కోర్ట్ రెండు సంవత్సరాలు జైలుశిక్షను విధించడంపై సుప్రీంకోర్ట్ స్టే ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తంచేస్తు గాంధీభవన్లో నిర్వహించిన వేడుకలలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారివెంట ఇల్లందు పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్, పులి సైదులు, టేకులపల్లి, గార్లమండల పార్టీ అధ్యక్షులు భుక్యాదేవా నాయక్, ధనియాకుల రామారావు తదితరులు పాల్గొన్నారు.