ఇల్లందు ఆస్పత్రి@ 100 పడకలు
-హరిప్రియ కృషి కి ప్రశంసలు
-కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
మన్యం న్యూస్,ఇల్లందు:
ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచనలతో ఉత్తర్వులు జారీ చేయడంపట్ల బీఆర్ఎస్ పట్టణ కమిటీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టౌన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ..ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల వైద్య విధాన పరిషత్ లోకి మారడంలోను నేడు 30 పదకలుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసపత్రిగా రూపాంతరం చెందడంలోనూ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కృషి ఎనలేనిది వారు తెలిపారు. ఇల్లందు ప్రజలకు ఎన్నోఏళ్ల కల అయిన 100 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ సాకారం చేశారని, నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం పరితపించే ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఖాతాలో ఈ వంద పడకల ఆసుపత్రితో మరో మైలురాయి వచ్చి చేరిందని వారు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యమంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి పువ్వాడలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి పర్చూరు వెంకటేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల హరికృష్ణ, అబ్దుల్ నబి, పర్రె శీను, ఎస్కేపాషా, ఎండి యాకూబ్, వసంతరావు, టిఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మేకల శ్యామ్, పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జ్ గిన్నారపు రాజేష్, ప్రచార కార్యదర్శి రఘువరపు రాకేష్, రాచపల్లి శీను, గోపగాని రాజు, పట్టణ యూత్ అధ్యక్షుడు మెరుగు కార్తీక్, యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్, పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు గండ్రతి చంద్రావతి, బుప్పి భాగ్యలక్ష్మి , భవాని, మదర్ బీ, ఇంద్రనగర్ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్, మండల ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పూడూరు లక్ష్మీనారాయణ, అక్కనపెల్లి సతీష్, తుంగపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.