అధర్మంపై ఎప్పటికీ ధర్మమే గెలుస్తుంది
సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రకఘట్టం – భద్రాచలం నియోజకవర్గ టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై హర్షం వ్యక్తంచేశారు. అన్యాయంపై న్యాయమే గెలిచిందని. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింతగా పెంచిందన్నారు.న్యాయమైన తీర్పు ఇచ్చినందుకు గౌరవ సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుతూ సత్యమేవ జయతే అని పేర్కొన్నారు. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమే విజయం సాధించిందని వచ్చే సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది దేశప్రజలకి ఒక శుభసంకేతమని ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని తెలిపారు.
భారతదేశ సమైక్యత, దేశ సమగ్రత, రక్షణ కొరకు రాహుల్ గాందీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర తో దేశప్రజల్లో మార్పు వచ్చిందని అది గ్రహించిన బీజేపీ ప్రభుత్వం ఓటమిభయంతో కుట్రపూరితంగా, నియంతృత్వ పోకడలతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటువేసి ఇల్లు ఖాళీ చేయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని ఇబ్బందులు పెట్టినా అది మంచికే అని చెడుకి తాత్కలికంగా ప్రచారం దొరికినా చివరకు సత్యమే విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. గుజరాత్ లో ఈ కేసు ఫైల్ అయిన వెంటనే ఆగమేఘాల మీద రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసే తీర్పువచ్చిందన్నారు.
తీర్పువచ్చిన 24 గంటలలోపే పార్లమెంటరీ వ్యవస్థ దానికి సంబందించిన అధికారులు సమయం ఇవ్వకుండా అనర్హత వేటు వేయడం.. అత్యంత హేయమైన చర్య అని ఆయన వ్యాఖ్యనించారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రకఘట్టమని అంతిమంగా సత్యమే గెలుస్తుందని సుప్రీం తీర్పు రుజువు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామని వ్యాఖ్యానించారు.