UPDATES  

 నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు – జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: కొత్తగూడెం, భద్రాచలం పట్టణ ట్రాఫిక్ పోలీస్ అధికారులు సిబ్బందితో ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫెరెన్సు హాలు నందు శుక్రవారం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారు ఎవరైనా సరే ఉపేక్షించకూడదని ఆదేశించారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై నరేష్, భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !