మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 04
మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ రక్షణ అధికారి జే.వెంకట రమణ శుక్రవారం నాడు సింగరేణి ప్రధాన చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక తనికి నిర్వహించారు.హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే ఉద్యోగులను గుర్తించి,వారిని హెల్మెట్ ధరించవలసిన ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సెక్యూరిటీ మెయిన్ చెక్ పోస్ట్ వద్ద ఏరియా రక్షణ ఆఫీసర్ జే.వెంకటరమణ మాట్లాడుతూ,మనిషి అవయవాలలోని అతి ముఖ్యమైన,అతి సున్నితమైన తల భాగం అని,హెల్మెట్ ధరించని కారణంగా ఏదైనా ద్విచక్ర వాహన ప్రమాదం సంభవిస్తే ప్రాణాపాయం జరుగవచ్చు అన్నారు.కావున ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించవలసిన ఆవశ్యకతపై ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఆదేశం మేరకు గతంలో నిర్వహించిన “నో హెల్మెట్ నో ఎంట్రీ” కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది అన్నారు.ఇంటి యాజమాని సురక్షితంగా ఉంటేనే ఆ కుటుంబం సుఖ శాంతులతో ఉంటుంది కాబట్టి అధికారులు కార్మికులు సూపర్వైజర్లు కాంటాక్ట్ కార్మికులు డ్యూటీకి వచ్చి వెళ్ళేటప్పుడు,వ్యక్తిగత పనుల మీద బయట తిరిగేటప్పుడు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి జే వెంకట రమణ,సింగరేణి ఉద్యోగులు,సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.