వర్షాకాలం వ్యాధుల పట్ల తస్మాత్ జాగ్రత్త
-సింగరేణి వైద్యులు శేషగిరి రావు
మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 04
సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా పికేఓసి -2 ప్రాంగణం లో ప్రస్తుత వానకాల వ్యాధుల నివారణ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల పై సింగరేణి వైద్యులు శేషగిరి రావు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సంధర్భంగా సింగరేణి డాక్టర్ శేషగిరి రావు మాట్లాడుతూ,సింగరేణి యాజమాన్యం ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అనేక చర్యలు తీసుకుంటూ ఉంది అన్నారు.అందులో భాగంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఆదేశంతో వర్షాకాలం వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల పై ఉద్యోగులలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉండాలి అంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని తెలిపారు.ముఖ్యంగా కలుషిత నీటి ద్వారా టైఫాయిడ్, హెపటైటిస్,కలరా,డెంగ్యూ,మలేరియా,వంటి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది అన్నారు.కాబట్టి వర్షకాలం వ్యాధుల నివారణకు పరిశుబ్రతను ప్రధాన అంశంగా వాడాలి అని,అందుకు గాను ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,మురికి నీరు పేరుకున్నా పూల కుండీలలో,ఇంటి చుట్టూ గడ్డి,పిచ్చి మొక్కలు పెరిగిన దోమలు వ్యాప్తి చెంది అవి కుట్టడం వల్ల విష జ్వరాలు వచ్చే,అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించి తగు జాగర్తలు తీసుకోవాలి అని తెలిపారు.ఇంట్లో దోమలు రాకుండా కిటికీలు,తలుపులకు సన్నని జాలి బిగించాలి అని,దోమ తెరలు కూడా వాడాలి అంటూ సింగరేణి ఉద్యోగులకు,కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఓసి-2 సేఫ్టీ అధికారి లింగబాబు,ఓసి-2 అధికారులు,సింగరేణి ఉద్యోగులు,కాంట్రాక్ట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.