మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 04
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం,కూనవరం గ్రామ పంచాయతీ లోని మారు మూల గిరిజన గ్రామమైన రేగుల గండి లో గత నెలలో గుండి.బాబులు-ఉంగమ్మ అను గిరిజన దంపతులకు అతి తక్కువ బరువు తొ పాప జన్మించింది.పాప ను వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించి ఇరవై రోజులు పాటూ,పాప ను బాక్స్ లో ఉంచి వైద్యం అందించారు.పాపను ఇంటికి తీసుకు రావడం జరిగింది అని, మరల పాప కు గత రెండు రోజులు నుండి ఆరోగ్యం బాగోలేదు అని, భద్రాచలం తీసుకొని వెళ్ళడానికి తల్లితండ్రులు నిరాకరిస్తున్నారని తెలుసుకున్నఎంపీటీసీ గుడిపూడి.కోటేశ్వరరావు వారి నివాసానికి వెళ్లి బాలింత ను,పాప ను పరామర్శించి వారికీ అవగాహన కల్పించి భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించడం జరిగింది.పాప సంపూర్ణ ఆరోగ్యం తొ తిరిగిరావాలి అని ఎంపిటిసి గుడిపూడి.కోటేశ్వరరావు ఆశభావం వ్యక్తం చేశారు.ఎంపీటీసీ కోటేశ్వరరావు స్పందించిన తీరును పలువురు ప్రశంశించారు.ఈ కార్యక్రమం లో ప్రభుత్వ డాక్టర్,గ్రామ పంచాయతీ సెక్రటరీ సంధ్యా రాణి,ఎంల్ హెచ్ పి ఇందిర,ఏయన్ఎం ఏ.వి.లక్ష్మి,ఆశ వర్కర్ మడకం.శారద,పంచాయతీ బిల్ కలక్టర్ ఊర్మిల తదితరులు పాల్గొన్నారు.