UPDATES  

 మాకు అటవీ హక్కు పత్రం బుక్స్ ఇవ్వండి!

మాకు అటవీ హక్కు పత్రం బుక్స్ ఇవ్వండి!
– అధికారులను వేడుకుంటున్న సాగుదారులు
– పత్రం లేని కారణంగా రైతు బీమాకు దూరమవుతారా..?

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
దేవుడు వరమిచ్చిన.. పూజారి కనికరించని చందంగా మా పరిస్థితి ఉందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసిన.. కొందరు అధికారులు మాత్రం తమకు అన్యాయం చేస్తున్నట్లుగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.. ఈ విషయం భద్రాద్రి జిల్లా కేంద్రంలో చర్చ నియాంశంగా మారింది.
గత అనేక సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుంటున్న వారి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి కళ.. నెరవేర్చిన విషయం విధితమే. స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అర్హులైన సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటన చేయడంతో వారి కళ్ళల్లో ఆనందం వెల్లు విరిసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అర్హులైన సాగుదారులందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అటవీ హక్కు పత్రం బుక్స్ ను అటహాసంగా పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదివాసి ముద్దుబిడ్డ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేగా కాంతారావుతో పాటు ఎమ్మెల్యేలు సైతం పాల్గొని పోడు సాగు లబ్ధిదారులకు హక్కు పత్రాలను అందించారు. అయితే కొందరి అధికారుల నిర్లక్ష్యం మూలంగా అర్హులైన మరికొందరు లబ్ధిదారులకు నేటికీ హక్కు పత్రాలు అందించకపోవడం విచారకరం. జిల్లావ్యాప్తంగా ఇంకా 500కు పైగా హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉన్నట్లుగా ప్రచారం జరగడం గమనించాల్సిన విషయం. లిస్టులో లబ్ధిదారుల పేర్లు ఉన్నప్పటికీ బుక్స్ చేతికి అందించకపోవడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో బుక్స్ రాని వారి లో కలవరం మొదలైంది. హక్కు పత్రంలో సాగు సంబంధించిన వివరాలు ఉంటేనే దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు 5వ తేదీ వరకే అవకాశం ఉండడం అయోమయం నెలకొంది. పథకాలు అందకుండా పోవడం వల్ల మదన పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించడం లేదంటూ వారు అసహనం వ్యక్తం చేయడం చర్చకు దారితీస్తుంది.
లిస్టులో పేరు ఉంది.. హక్కు పత్రం బుక్కు ఇవ్వలేదు: రవికుమార్
పోడు అర్హత లిస్టులో తన పేరు ఉందని కానీ హక్కు పత్రం పుస్తకం మాత్రం ఇవ్వలేదని చుంచుపల్లి మండలం బంగారు చిలుక గ్రామపంచాయతీ సమీపంలోని ఉన్న కొత్త చింతకుంట గ్రామానికి చెందిన వజ్జ రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
హక్కు పత్రం కోసం తిరుగుతున్న: వజ్జ పద్మ
సీఎం కేసీఆర్ తనకు పోడు హక్కు పత్రం మంజూరు చేసిన ఇక్కడి అధికారులు మాత్రం హక్కు పత్రంకు సంబంధించిన బుక్కు ఇంతవరకు ఇవ్వలేదని ఈ బుక్ లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని కొత్త చింతకుంట గ్రామానికి చెందిన వజ్జ పద్మ ఆవేదన వ్యక్తం చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !