UPDATES  

 కల్లోల కాంగ్రెస్

కల్లోల కాంగ్రెస్

పినపాక నియోజకవర్గంలో భారీగా ఆశావహులు

– టికెట్ రేసులో ఇప్పటికే పదిమంది

– సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వార్

– వర్గ పోరు తో హస్తవ్యస్తం

మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి, పినపాక:

వర్గ పోరుకు హస్తం పార్టీ కేరాఫ్ గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో ఉన్న వర్గ పోరుకు పొంగులేటి చేరికతో ఇంకా వర్గ పోరు పెరిగింది. ఎలక్షన్ నాటికి కాంగ్రెస్ పార్టీ లో డిష్యుం…డిష్యుం ఇంకా అధికం అయ్యే ఛాన్స్ ఉంది. తుఫాన్ వచ్చే ముందు అంతా ప్రశాంతంగా ఉంటుంది అనేది నానుడి. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిస్థితి ఉందని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉన్నప్పటికీని మిగతా నియోజకవర్గం పినపాక నియోజకవర్గం లో ఈ పరిస్థితి అధికంగా ఉంది.పినపాక హస్తం టికెట్ రేసులో 15 మందికి పైగా పోటీలో ఉన్నట్లు సమాచారం. తొలుత పినపాక నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొరస ఆనంద్ పేరు వినబడగా అనంతరంబట్టా విజయ్ గాంధీ, దనసరి సూర్య, పోలేబొయిన శ్రీవాణి,పాయం వెంకటేశ్వర్లు(పొంగులేటి వర్గం),కొమరం కాంతరావు,కొమరం లక్ష్మణ్ రావు ఇంకా అనేక పేర్లు పినపాక కాంగ్రెస్ టికెట్ ఆశించే వారి జాబితా చెంతాడు లో పెరిగి పోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి మరికొన్ని పేర్లు తెరమీదికి వచ్చా అవకాశం ఉన్నది.

సీతక్క తనయుడిపై కామెంట్లు

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు ధనుసరి సూర్య పినపాక టికెట్ కోసం ఎప్పటి నుండో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో పినపాక నియోజకవర్గం లో సుడిగాలిపర్యటనలు చేయడం, అప్పన్న హస్తాలు అందించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దానసరి సూర్య భాయ్ కి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నట్లు సూర్య అనుచరులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. ఈ సంఘటన పట్ల ఆయన అనుచరులు భగ్గు మంటున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల మథనం

నానాటికి పినపాక నియోజకవర్గం లో వర్గ పోరు అధికం అవుతుండడంతో ఎవరి తిరగాలో అర్థం కాక కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు తల పట్టుకుంటున్నారు.
ఒకవైపు పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే రేగా కాంతారావు వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇది ఇలా ఉండగా పొంగులేటి వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీని నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న తమ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందోనని మదన పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతకాలం ముందు వరుసలో నిలబడ్డ ఆ సీనియర్ నాయకులు ప్రస్తుత పరిస్థితులలో వెనకాల నిలబడాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎలక్షన్స్ వరకు తమను వారిని తరువాత పక్కకు పెడతారనే భావన వానిలో మెండుగా ఉన్నది. నేనే పద్యంలో వారి సైతం ప్రత్యామ్నయం వెతుక్కున్నట్లు సమాచారం.

అధికార బీఆర్ఎస్ పార్టీకి వలసలు

పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్న ఆ పార్టిముఖ్య నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒకవైపు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న అభివృద్ధి పనులు, కష్టకాలంలో పినపాక నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్న నేపథ్యంలో పినపాక నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన హస్తం పార్టీ కార్యకర్తలు గులాబీ గూటికి చేరడం జరిగింది. కష్టకాలంలో తనను నమ్మిన వారికి అండగా ఉంటాడని భరోసాతో ఇటీవల కాలంలో రేగా కాంతారావు ఆధ్వర్యంలో వందల కుటుంబాలు బీ.ఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ పరిస్థితులలో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి పినపాక నియోజకవర్గం లో గడ్డు పరిస్థితులు తప్పవు. హై కమాండ్ కు సైతం పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పరిస్థితి తలనొప్పిగా మారనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !