మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- తెలంగాణ సిద్ధాంతకర్తగా,ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 89వ జయంతి వేడుకలు సారపాక బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని,ఆయన ధృడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదు అని బూర్గంపహాడ్ బి.ఆర్.ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణా రెడ్డి అన్నారు,సారపాక టౌన్ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించి అభిమానం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణా రెడ్డి,సారపాక టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి,పినపాక నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ,సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీ చైతన్య రెడ్డి,సీనియర్ నాయకులు కరీ నాగేశ్వరరావు,బెజ్జంకి కనకాచారి,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ఈశ్వర్ రావు,దార నరసింహారావు,దాసరి మోహన్,రాయల నరేంద్ర,గొడ్ల రాజు,చెలికాని శివ,ఆదూరి నాగరాజు,ఎసుబ్,దేవల్ల గురవయ్య,వేముల పౌల్ తదితరులు పాల్గొన్నారు.