యూత్ ఫర్ యాంటీ కరప్షన్,వి ఫర్ ఉమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు
-వైద్య సేవలు అభినందనీయం.
-ఏటూరు నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్.
-ఇంటి సామాగ్రితో పాటు దుస్తులు అందజేత
-శిబిరాన్ని ప్రారంభించిన ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల వలన సర్వం కొల్పోయి నిలువ, నీడ లేకుండా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మరియు హైదరాబాద్ కు చెందిన వీ ఫర్ ఉమెన్ సంస్థ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.వీ ఫర్ ఉమెన్ పౌంఢర్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి అధ్వర్యంలో వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని మెడిసిన్ అందజేశారు.సర్వస్వం కొల్పొయిన కుటుంబాలకు ఇంటి సామాగ్రితో పాటు దుస్తులు అందజేశారు.ఈ మెగా హెల్త్ క్యాంపును ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హజరై ప్రారంభించారు.ఆనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు ఏ ఒక్క వస్తువు మిగలకుండా అన్ని వస్తువులు కొల్పోయిన కుటుంబాలకు హైదరాబాద్ నుంచి యూత్ ఫర్ యాంటీ కరప్షన్,వీ ఫర్ ఉమెన్ సంస్థలు వచ్చి సహాయం చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు.ఆపదలో ఉన్నవారిని ఆదుకొవడానికి ముందుకు వచ్చినవారిని మనస్ఫూర్తిగా అభినందించాలన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి,ఏటూరునాగారం సిఐ మండల రాజు, ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్,డా.అన్నపూర్ణ,డా.మదన్ మోహన్,యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మీడియా కార్యదర్శి జయరాం,ములుగు జిల్లా అధ్యక్షుడు పంబిడి శ్రీధర్ రావు,యాక్ సభ్యులు అభిరాం,అశ్విని,కొక్కుల ప్రశాంత్,ఎస్.కె ముస్తఫా,సుకుమార్,బ్రహ్మచారి,నాగరాజు,రవి ప్రసాద్,యాకూబ్,బోయిని రాజు తదితరులు పాల్గొన్నారు.కొంత సామాగ్రినీ ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్,జెమ్ ఓపెన్ క్యూబ్ సిఈఓ పి వినోద్ కుమార్ సహకారం అందించారు.ఈ శిబిరంలో కొండాయి,మల్యాల,దొడ్ల,చల్పాక, ఎలిసెట్టిపల్లి,అల్లవారి ఘణపూర్,గుర్రాలబావి గ్రామాలకు చెందిన 500కు పైగా ప్రజలు హజరయ్యారు.
