మన్యం న్యూస్ గుండాల: కళ్ళ కల అశ్రద్ధ చేయవద్దని కంటి వైద్య నిపుణులు ఖండే దేవేందర్ సూచించారు. కండ్ల కళకళ కళ్ళలోకి చూడడం ద్వారా రాదని ఆయన అన్నారు. కన్ను నీరు కారుతుంటే అది ఇంకొకరికి అంటించడం ద్వారా కళ్ళ కళకళ వస్తుందని ఆయన అన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడటం ద్వారా దీనిని నివారించవచ్చని అన్నారు. అశ్రద్ధ చేస్తే కంటిచూపుకే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన సూచించారు. లక్షణాలు కండ్లు ఎర్రబారడం తద్వారా జలుబు కూడా వస్తుందని అన్నారు చిన్నపిల్లల్లో అయితే జ్వరం కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. సాధారణ కళ్ళ కలక వస్తే వారంలోపు తగ్గుతుందని వైరస్తో కూడిన కళ్ళ కలక వస్తే మూడు వారాలు పడుతుందని అన్నారు.కళ్ళకు గాలి తగలకుండా త్వరగా నయం చేసుకోవచ్చని అన్నారు
