మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం మీకోసం మేమున్నాం సహాయక కమిటీ ఆధ్వర్యంలో సీ ఎస్ ఐ చర్చిలో పది మంది పేద విద్యార్థులకు పెన్నులు,పుస్తకాలు, ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ, లిటిల్ జీకె పుస్తకాలు, స్వీట్స్ మీకోసం మేమున్నాం కమిటీ పీఆర్ఓ దొడ్డా ప్రభుదాస్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మీకోసం మేమున్నాం సహాయక కమిటీ ఛైర్మన్ నీలి ప్రకాష్, ఫాస్ట్రేట్ కమిటీ చైర్మన్ ఇందుపల్లి జెర్మియ్య, సంఘ ప్రతినిధులు , సండే స్కూల్ టీచర్ మోతుకూరి కావ్య తదితరులు పాల్గొన్నారు.