UPDATES  

 ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు

ప్రొఫెసర్ జయశంకర్ జయంతినీ పురస్కరించుకొని
ఎంపీ నామా ట్రస్ట్ ద్వార ఆటో డ్రైవర్లకు కాకి చొక్కాలు పంపిణీ

మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఆగస్టు, 06: మండలం అశ్వరావుపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా గ్రామంలోనీ ఆటో డ్రైవర్లకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు వారి నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా ఉచితంగా కాకి చొక్కాలు పంపడం జరిగింది. అట్టి కాకి చొక్కాలను అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా.నాగేశ్వర రావు సూచనల మేరకు ఆదివారం అశ్వరావుపేట మండల నాయకులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు ఆటో డ్రైవర్లకు 300 మందికి కాకి చొక్కాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ మండల నాయకులకు ఎమ్మెల్యే కి ఎంపీ నామా నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ లోడ్ వేయకుండా ప్రయాణికులను వారీ గమ్య స్థానాలకు క్షేమంగా చేర్చాలని అతివేగంగా ఆటోలను నడపవద్ధని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి టెలికాం అడ్వైజెర్ కమిటి మెంబర్ బిర్రం వేంకటేశ్వర రావు, అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, జిల్లా అధికార పార్టీ ప్రతినిధి యుఎస్ ప్రకాష్, మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, చిప్పన పల్లి బజారయ్య, తాళంసూరి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !