మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి ఇందిర, కలెక్టరేట్ ఏ ఓ గన్యా పాల్గొని జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను వారు వివరించారు. జయశంకర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర మరువలేనిదని చెప్పారు. ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.