ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం….
చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని స్థంభానికి కట్టేసి చితికబాదిన గ్రామస్తులు….
మన్యం న్యూస్ చంద్రుగొండ, ఆగస్టు 6 : మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామంలోని ఆదివారం సాయంత్రం కేసీఆర్ కాలనీకి చెందిన ఆరేళ్ల బాలికపై తిప్పనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, కాలనీ వాసుల కథనం ప్రకారం వివరాలలు ఇలా ఉన్నాయి. తిప్పనపల్లి పంచాయతీలోని కొత్తగా నిర్మించిన కెసిఆర్ కాలనీలో నివసిస్తున్న కుటుంబసభ్యురాలైన ఆరేళ్ల బాలికపై తిప్పనపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ లాలు అనే కామాందుడు మద్యం మత్తులో చిన్నారిని కేసీఆర్ కాలనీకి చెందిన ఒక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా చిన్నారి కేకలు పెట్టింది. విషయం బయటకు పొక్కడంతో చిన్నారి తల్లితో పాటు సమీపంలోని గ్రామస్తులు వచ్చి నిందితుడైన లాలుని స్థంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.