మన్యం న్యూస్ మణుగూరు ఆగస్టు 6
ప్రజా యుద్ద నౌక గద్దర్ ఆలియాస్ గుమ్మడి విఠల్ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తీవ్ర సంతాపం తెలిపారు.పాటతో ప్రజలను చైతన్యం చేసిన గద్దర్ జనం గుండెల్లో ఎల్లపుడూ జీవించే ఉంటాడని,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.