మన్యం న్యూస్ మణుగూరు ఆగస్టు 6
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎంపీపీ కారం విజయ కుమారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా,ఎంపీపీ కారం విజయకుమారి,ఎంపిటిసిల జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ నిర్మాణ కర్త అని,తెలంగాణ భావ జాలన్నీ పల్లే పల్లే లో నినదిం చిన గొప్ప ఉద్యమ నాయకులు అని కొనియాడారు.వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ల జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు జావీద్ పాషా,పినపాక నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.