మన్యం న్యూస్, బూర్గంపహడ్ : మండల పరిధి సోంపల్లి గ్రామం లో డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న 200 కుటుంబాల సంరక్షణ కోసం చేతన ఫౌండేషన్ వారి సహకారంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ధనసరి సూర్య ముఖ్య అతిథిగా హాజరైన బాధిత కుటుంబాలకు దోమతెరలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యారం నాగిరెడ్డి, అవుల వెంకటరామిరెడ్డి, కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పోతిరెడ్డి కోటిరెడ్డి, రహీం ఖాన్, అన్వర్ పాష, నరసింహారావు, సంపత్, రాంబాబు, తొఫిక్, చిన్నపరెడ్డి, చందా ప్రసాద్, పల్లపు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
