ఆగస్టు 15న గృహలక్ష్మీపథకం ప్రారంభం
*ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మొద్దు
మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి, పినపాక:ఈ నెల 15న గృహలక్ష్మీపథకం లాంఛనంగా ప్రారంభమవుతుందని విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొంతమంది ఈ పథకంపై అసత్య ప్రచారం చేస్తున్నారని అలాంటి వారి మోసపూరిత ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. అర్హులైన నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టించడం తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గృహలక్ష్మీపథకం కు సంబంధించిదళారుల మాయలో పడి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
