- సిండికేటుగాళ్ళు
- మామూళ్ళమత్తులో అధికారులు
- విజిలెన్స్ నజర్
- మన్యంన్యూస్ ప్రకంపనలు
ఇల్లందు:
ఇల్లందు సిండికేటు.. చెప్పిందే రేటు అంటూ మన్యంన్యూస్ లో ప్రచురితమైన కథనం సంచలనమైంది. ఇల్లందు ప్రాంతంలో వైన్ షాపుల దోపిడీ, మామూళ్లగంతలు కట్టుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి. మన్యంన్యూస్ కథనానికి పెద్ద ఎత్తున స్పందన రాగా, వైన్ షాపులలో ఎమ్మార్పీకి మించి అధికరేట్లు వసూలుచేసే దుకాణాలను సీజ్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. మన్యంన్యూస్ కథనం నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఇల్లందు మద్యం దుకాణాలు, బెల్టుదందాపై సీరియస్ గా నిఘాపెట్టినట్లు తెలిసింది. ఇటీవల పలువురు సిఐలపై చర్యలు తీసుకోగా, ఇపుడు ఇల్లందు వ్యవహారం చర్చనీయాంశమైంది.
…….