- రేగా రెడీ
- ప్రత్యర్ధి ఎవరు?
- పినపాక నియోజకవర్గ రౌండప్
- బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోటీ
- రేగాకు అనేక అనుకూలతలు
- ప్రత్యర్ధి పార్టీలలో కుమ్ములాటలు
- ప్రజల సమస్యలు పట్టేవారికే పట్టం
- మన్యం న్యూస్, బూర్గంపహాడ్ :
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పినపాక నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం స్పష్టంగా ఉందా? ఎన్నడూలేని రేతిలో విపక్ష పార్టీలు గందరగోళంగా ఉండగా, దూకుడు మీదున్ననేతకు తిరుగులేదా? తాజా పరిణామాలు ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అనుకూలంగా ఉన్నాయా? ప్రతిఘటన ఎదురవుతోందా? పినపాక నియోజకవర్గ రౌండప్ ప్రత్యేకంగా..
ఇదీ చరిత్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా లోని శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. బూర్గంపహాడ్ శాసనసభ నియోజకవర్గం 1962 నుంచి ఏర్పడి 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పినపాక శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెంది,ఈ నియోజకవర్గంలో 1962 నుంచి 2009 వరకు ఒక ఉప ఎన్నికతో సహా 14సార్లు ఎన్నికలు జరిగాయి.ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు,సీపీఐ ఐదుసార్లు,టీడీపీ,ఇండి పెండెంట్,వైసీపీలు చెరొక్క సారి గెలుపొందారు.బూర్గంపహాడ్ నియోజకవర్గంగా ఉన్న ఈ ఎస్టీ రిజర్వుడు ప్రాంతంలో ఒకలక్ష 67,676 మంది ఓటర్లు ఉండగా మరణాల ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా 18 ఏళ్ళు నిండిన వారి ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ఇంకా ఓట్ బ్యాంకింగ్ పెరిగే అవకాశం ఉంది.మొత్తంగా ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు మండలాల్లో విస్తరించి ఉన్న ఈ పినపాక నియోజకవర్గం.మొత్తంగా ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గం లో అటవీ ప్రాంతంతో కూడుకున్న పోడు భూములు ఎక్కువగా ఉంటాయి.పోడు వ్యవసాయం మీద ఆధారపడి వందల,వేలాది గిరిజన కుటుంబాలు జీవిస్తున్నప్పటికి,అడవుల ఆధారంగా జీవించే గిరిజనులకు పోడు భూములే ఆధారం అందుకే వారు ఈ భూముల కోసం ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై సైతం వీరు ప్రభావం చూపిస్తుంటారు.ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోడు భూముల సమస్యలను ఎన్నికల అస్త్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు ముందుకు వెళ్ళుతుంటాయి అని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు.
అనుకూలతలు- వ్యతిరేకతలు
ఈ నేపథ్యంలో పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేసే రేగా గత ఎన్నికల్లో కూటమి నుండి గెలుపొంది గిరిజన రైతుల పొడుభుముల పట్టాల కోసం కంకణం కట్టుకొని కూటమిలో కొనసాగితే పట్టాలు లభించే పరిస్థితులు లేవు అని గులాబీ తీర్థం పుచ్చుకొని పదే,పదే పోడు ప్రస్తావన తెచ్చి సీఎం కేసీఆర్ ను ఒప్పించారు.
– నీ బీజేపీ పార్టీ కొనుగోలు చేసేందుకు 100 కోట్ల ఆఫర్ ఇవ్వడంతో దానికి రేగా నో చెప్పడంతో విషయం తెలుసుకున్నసీఎం కేసీఆర్ రేగాని అభినందించి వారి యొక్క నియోజకవర్గానికి 100 కోట్ల అభివృద్ధి నిధులను రేగాకి బహుమతిగా ఇచ్చారు. అంతే కాకుండా 2023 లో పోడు రైతాంగానికి పాసు పుస్తకాలు సైతం పంపిణీ చేయడంతో,దీంతో నియోజకవర్గం ఎంటి రాష్ట్ర,దేశ ప్రజల్లో రేగా కి మంచి పేరొచ్చింది. గులాబీ గూటి నుండి కాంగ్రెస్ గూటికి 2023లో వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లు పోటీ చేసే అవకాశం ఉంది అంటూ నియోజకవర్గ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.అధికార పార్టీలో చేరిన రేగా కాంతారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విప్ పదవి సైతం ముందుగానే కట్టబెట్టారు. రేగా సమర్ధత చూసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు. రేగా కాంతారావు గులాబీ పార్టీలో చేరడంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి అని,ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు కొనసాగాయి.
– కొద్దిరోజుల క్రితమే పొంగులేటితో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పాయం వెంకటేశ్వర్లు. అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో వచ్చే ఎన్నికల్లో పాయం వెంకటేశ్వర్లు పినపాక నుంచే బరిలో ఉంటారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంతో ఇక లోకల్ గా పొలిటికల్ రాజకీయం వేడెక్కింది. తాను ఏ పార్టీలోకి వెళ్లిన తాను ప్రకటించిన వారే అభ్యర్థులుగా ఉంటారని ఆయన స్పష్టం చేయడంతో పినపాక నియోజకవర్గంలో పాయం పర్యటిస్తూ స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్నారు.లోకల్ గా ప్రచారం చేసుకుంటూ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో వారి పార్టీలోనే వర్గ విబేధాలు ఏర్పడి నియోజకవర్గ పార్టీ టికెట్ నాకంటే నాకు అనే తరుణంలో విబేధాలు ఏర్పడి ఎవరి స్టయిల్ లో వారు వ్యక్తిగత ప్రచారంలో నిమగ్నం అయ్యారు. దీంతో కాంగ్రెస్ నుండి ఎవరికి టికెట్ లభిస్తుందోనన్న గందరగోళం నెలకొంది. ఒకవైపు రేగాకాంతారావు ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ, నిత్యం అభివృద్ధి పనులు వాటి యొక్కవార్తల్లో ఉండడమే కాక పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి గిరిజన పోడు భూములకు చెందిన వేల ఎకరాలకు పాసు పుస్తకాలు కల్పించడంతో గిరిజనుల్లో ఇంకా పాపులారిటీ .వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ అసెంబ్లీలో నేనే అడుగుపెడతానని ధీమా కుడా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్లో ప్రజల్లో తలలో నాలుకలా ఉంటున్న రేగా కాంతారావుకు అదే బిగ్ ప్లస్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పినపాక నియోజకవర్గ రాజకీయం రేగాకాంతారావుకు పూర్తి అనుకూలంగా ఉండగా, అప్రమత్తతతో ఇదే పరిస్థితి కొనసాగిస్తే విజయం ఖాయమన్న అంచనా విశ్లేషకుల్లో ఉంది. ప్రధానంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంది.
…….