మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 9
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మణుగూరు మండల పరిధిలోని హనుమాన్ టెంపుల్ వద్ద గల కొమరం భీమ్ విగ్రహానికి జడ్పిటిసి పోశం.నరసింహారావు,ఆదివాసులు,బిఆర్ఎస్ పార్టి నాయకులతో కలిసి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.సీఎం కేసీఆర్ పరిపాలన లో ఆదివాసుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు అన్నారు.పోడు గోడు తీర్చిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ అని తెలిపారు.పోడు భూమలకు పట్టాలతో పాటు రైతు బంధు, రైతు భీమా కల్పించడం జరిగింది అన్నారు.కొమరం భీమ్ ఆశయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేయడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టి మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, మణుగూరు టౌన్ అద్యక్షులు అడపా.అప్పారావు,బిఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు యూసుఫ్,ఆదివాసీ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,మహిళ నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.