మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
హన్మకొండ డిపిఆర్వో కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా పని చేస్తున్న అజ్గర్ హుస్సేన్ కు సహాయ పౌర సంబంధాల అధికారి పదోన్నతి కల్పిస్తూ ఆర్జేడీ డిఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఎండి అజ్గర్ హుస్సేన్ సహాయ పౌర సంబంధాల అధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భాద్యతలు చేపట్టిన అజ్గర్ హుసేన్ ను డిపిఆర్వో శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది అభినందించారు.