UPDATES  

 వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
వైద్య సిబ్బంది తప్పని సరిగా సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లైన్ డిపార్ట్మెంట్స్ తో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖలోని అన్ని విభాగాల వైద్యులను విధుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ డిస్టిక్ పారా మీటర్స్ నందు మన జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. సిబ్బంది యొక్క హాజరు బయోమెట్రిక్ విధానంలో నూరు శాతం ఉండాలని దాని ప్రకారమే వేతనాలు చేయాలని చెప్పారు. బయోమెట్రిక్ లేని చోట సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్లు తప్పుడు అటెండెన్స్ ఇస్తే దానికి వారే బాధ్యులను చేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఆసుపత్రి పనులు ఎంత జరిగినవి ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది నివేదికలను అందచేయాలని చెప్పారు. వైద్య శాఖ ప్రతి పారామీటర్స్ పై ప్రతి నెలా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. వైద్య సిబ్బంది తప్పని సరిగా సమయ పాలన పాటించాలని చెప్పారు.
వ్యాధులు ప్రబలే కాలమని అత్యవసర మందులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పేర్కొన్నారు.
తన ఆకస్మిక తనికిలో అపరిశుభ్రత ఉంటే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.వి.ఎల్ శిరీష ,డిప్యూటీ డి.ఎం అండ్ హెచ్. ఓలు డాక్టర్ సుకృత, డాక్టర్ రాజ్ కుమార్, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారస్వామి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. లక్ష్మణ్ రావు, డి సి హెచ్ ఎస్, రవి బాబు,
ఎం సి హెచ్ రామవరం డాక్టర్ సరళ, పాల్వంచ, మణుగూరు, బూర్గంపాడు, అశ్వరావుపేట, ఇల్లందు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పర్యవేక్షకులు, టీఎస్ ఎంఐడిసి
ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !